13-09-2025 09:57:42 PM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మార్డి నుండి కిష్టాపూర్ వెల్లే దారిలో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి. కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. మార్డి గ్రామానికి చెందిన చింతల భూమయ్య 35 సం" తన ద్విచక్ర వాహనం టీవీఎస్ ఎక్సెల్ పై కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్నా పొలానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కుటుంబికులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు