calender_icon.png 15 May, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొన్న అడవి పంది

14-05-2025 11:36:36 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): అడవి పంది ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బుధవారం ఓ సింగరేణి కార్మికునికి గాయాలు కాగా, అదే ప్రమాదంలో అడవి పంది మృతి చెందింది. ఈ ఘటన ‌రామకృష్ణాపూర్ ఆర్కేవన్ సింగరేణి రెస్క్యూ స్టేషన్ సమీపంలో జరిగింది. పట్టణంలోని కాకతీయ కాలనికి చెందిన ఎన్. శ్రీనివాస్ అనే సింగరేణి కార్మికుడు కైరిగూడా ఉపరితల గనిలో విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న సమయంలో ఆర్కేవన్ సింగరేణి రెస్క్యూ స్టేషన్ సమీపంలోకి రాగానే అడవి పంది వేగంగా వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా ఢీకొట్టడంతో అడవి పందిని అక్కడికక్కడే మృతిచెందింది. కాగా తీవ్ర గాయాలైన  కార్మికున్ని సింగరేణి అబ్బులెన్స్ లో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు.