calender_icon.png 10 August, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి నుంచి ఏఐ వైపు అడుగులు

15-05-2025 12:00:00 AM

పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, మే 14 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అంది స్తూ విద్యాబోధన చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తన గొండి  మాతృ భాష అభివృద్ధికి కైలాష్ చేస్తున్న కృషిని దేశ ప్రధాని మెచ్చే స్థాయికి ఎదగడం జిల్లాకే గర్వకారణమన్నారు.

తుడ సం కైలాస్ తన జీవిత గాథకు సంబంధించిన స్వీయ ఆత్మకథను ఇంగ్లీష్‌లో From Forest Land to AI world పేరుతో,  తెలుగు భాషాలో ‘అడవి నుంచి AI వైపుకు అడుగులు’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఆదిలాబాద్ డైట్ కళాశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో తన అమ్మతో తునికి ఆకులు తెంపడానికి అడవికి వెళ్లి న జ్ఞాపకాలు, తన తండ్రితో అన్నయ, తమ్ముడి తో కలిసి అడవికి పొయ్యిల కట్టెలు, వడ్రంగి పనికి వచ్చే కట్టెలను తేవడానికి అడవికి వెళ్లిన జ్ఞాపకాలు, తన చెల్లెలితో ఇప్ప పువ్వు, ఇప్ప పరక సేకరించడానికి అడవికి వెళ్లిన జ్ఞాపకాలు, తాను పశువులకు కాపరిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను పొం దుపర్చా రు.

తన జీవితంలో ఏవిధంగా కష్టపడి ఉపాధ్యాయ వృత్తిలో చేరి అనుభవిం చిన కష్టాల ను, అనుభవాలను, విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూనే, కంప్యూటర్, ఏఐ టెక్నాలజీ నేర్చుకొని తన మాతృ భాష పరిరక్షణ కోసం పుస్తకాలు రాస్తూ పాటలు పాడించ డం, వార్తలు చదివించి దేశ ప్రధాని మెచ్చుకునే స్థాయికి ఎదిగిన విధానాన్ని ఈ పుస్త కంలో ప్రస్తావించారు.

ఈ పుస్తకాన్ని సైతం  కైలాస్ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కవర్ పేజీ డిజైన్‌తోపాటు మైండ్ మ్యాపింగ్ త యారు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డా.కోల కిరణ్ కుమార్, సుజాత్ ఖాన్, శ్రీకాంత్ గౌడ్,  రఘునాథ్, ఉపాధ్యాయులు అజయ్ పాల్గొన్నారు.