11-08-2025 06:14:56 PM
డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రభు కిరణ్..
తాడ్వాయి (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రభు కిరణ్(Deputy DMHO Prabhu Kiran) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిబ్బంది కచ్చితంగా ప్రతిరోజు సమయపాలన పాటించాలని సూచించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు సరైన చికిత్సలు అందించాలని కోరారు. నులి పురుగుల నివారణ మాత్రలు పిల్లలకు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వ్యాక్సినేషన్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సిబ్బంది పాల్గొన్నారు.