calender_icon.png 11 August, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డుల పంపిణీ

11-08-2025 05:45:45 PM

10 సంవత్సరాల బీఆర్ఎస్ ఒక రేషన్ కార్డు పంపిణీ చేయలేదు..

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Laxmi Kantha Rao) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను, నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు గొప్ప పథకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  కొంగల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్, తాహసిల్దార్ వేణుగోపాల్ ,ఎంపిడివో గోపాలకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.