11-08-2025 06:02:25 PM
మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్..
చేర్యాల: సిద్దిపేట జిల్లా(Siddipet District) చేర్యాల మండలంలోని నాగపూరి గ్రామ రైతు వేదిక నందు చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ మాట్లాడుతూ... 05-06-2025 లోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తప్పనిసరిగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సోమవారం స్థానిక వ్యవసాయ శాఖ రైతువేదిక కార్యాలయం ఆవరణలో రైతుల నుండి రైతు భీమాకు కావలసిన పత్రాలు తీసుకున్నారు.
రైతు బీమా పొందడానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు అని వారినుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు తమ వివరాల్లో ఏమైనా సవరణలు చేసుకోవాలనుకుంటే, ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారిని లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు.