11-08-2025 05:43:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవ సందర్భంగా సోమవారం ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా ఇంచార్జ్ ముడారపు పరమేశ్వర్(District Incharge Mudarapu Parameshwar) ప్రారంభించారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. 19 సంవత్సరంలోపు పిల్లలందరికీ ఈ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.