05-11-2025 12:00:00 AM
పోలీసు వాహనం కడుగుతుండగా ప్రమాదం
వికారాబాద్, నవంబర్ -4(విజయక్రాంతి) : పోలీసు వాహనం కడుగుతుండగా విద్యుత్ షాక్‌కు గురై హోంగార్డు మృతి చెందిన సంఘటన మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఎస్పీ కార్యాలయంలోని మోటార్ వెహికల్ సెక్షన్‌లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీనివాస్ పోలీస్ వాహనాన్ని కడుగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ విషయం గమనించిన తోటి ఉద్యోగులు శ్రీనివాస్‌ను వెంటనే వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి శ్రీనివాస్ కుటుంబీకులను పరామర్శించారు. శ్రీనివాస్ మృతి బాధాకరమని తెలిపారు.