05-11-2025 03:40:16 PM
వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు తరలివచ్చారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో అభిషేకం, అర్చనలు, హారతులు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఉమాశంకర్, హరీష్ శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలతో ఆలయ ప్రాంగణం ప్రకాశించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయం వద్ద భక్తుల సందడి అలరించింది.