05-11-2025 03:35:19 PM
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందించనున్న నాన్ ఓవెన్ సంచులను కాంగ్రెస్ నాయ కులు పంపిణీ చేశారు. మండలం లోని చిర్రకుంట గ్రామంలో బుధవారం రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన నాన్ ఓవెన్ సంచులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అనేక అనేక పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తుంద న్నారు. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ కార్య క్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయ కులు కామెర బాలయ్య, పెద్దాల రాజయ్య, సంపత్ రావు, కొప్పుల రాములు, దుర్గం సుధాకర్, రామటెంకి తిరుపతి, ఉప్పులపు భూమయ్య, సిద్ధం భూమేష్, దుర్గం తిరుపతి, లు పాల్గొన్నారు