calender_icon.png 19 January, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తా

06-11-2024 02:45:25 PM

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్..

నిజామాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అన్నారు. బుధవారం నిజామాబాద్ లోని టీఎన్జీవో భవనంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు వివాదాలకు తావివ్వకుండా తాను టీఎన్జీవో సమస్యలపై ముందుకు వెళ్తానని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గౌరవ పెద్దల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. అన్ని వర్గాల ఉద్యోగులు తనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు అలుకకీషన్, పెద్దోళ్ల నాగరాజు ఉద్యోగులు పాల్గొన్నారు.