calender_icon.png 9 July, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను పెళ్లాడతావా.. ఔనా? నువ్వు చిలిపి!

09-07-2025 12:04:07 AM

అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’లోనూ నిధినే హీరోయిన్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవలే వెంకటేశ్ సినిమాలోనూ నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారన్న మాట వినవస్తోంది. ఇదిలా ఉండగడా నిధి అగర్వాల్ అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా చేసిన చిట్‌చాట్‌లో ఓ అభిమాని చేసిన పనికి తాను షాక్ అయ్యానని తెలిపింది నిధి. ఇంతకీ ఏం జరిగిందంటే, ఈ చిట్‌చాట్‌లో ఓ అభిమాని మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు.

“మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి.. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి” అంటూ హార్ట్ ఎమోజీతో విజ్ఞప్తి చేశాడు. దీనికి నిధి ‘అవునా? చిలిపి..’ అంటూ సమాధానమిచ్చింది. మరి ఈ సందర్భంగా నిధి అగర్వాల్ ఇంకా అభిమానులతో ముచ్చట్లు ఏంటంటే.. “హరిహర వీరమల్లు’లో విభిన్న పాత్ర పోషించా. జీవితంలో ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంటుంది.

హార్స్ రైడింగ్, డాన్సింగ్ సరదాగా సాగాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, క్లుమైక్స్ కోసం ఎదురుచూడండి. నేను చెప్పానని ఎవరికీ చెప్పకండి (నవ్వుతూ). ‘హరిహర వీరమల్లు’ నా బిడ్డలాంటిది. ఈ సినిమాపైన, దీనికోసం పనిచేసినవారిపైన, అభిమానులపైన నా ప్రేమ ప్రత్యేకమైనది. మనమంతా గెలుస్తామని ఆశిస్తున్నా. ‘రాజాసాబ్’లో నేనొక రొమాంటిక్ సాంగ్ కూడా చేశా” అని తెలిపింది.