29-01-2026 12:00:00 AM
కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ
ఖైరతాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : ఇటీవల ఖైరతాబాద్‌లో శ్రావణి అనే మూడు సంవత్సరాల చిన్నారి కుక్కల దాడికి గురైంది. ఆ బాలికకు తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ను అందజేస్తున్నారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి రెయిన్ బో హాస్పిటల్‌కు బుధవారం వెళ్లారు. చిన్నారి శ్రావణిని స్వ యంగా పలకరించడంతో పాటు బాలికకు టుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తాను అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చా రు.
ఈ సందర్భంగా చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారన్నారు. చిన్నారులు వాటికి బలైతున్నారని ఆరోపించారు. గతంలో అంబర్‌పేట, గోల్కోండ ప్రాంతాల్లో దుర్ఘటనలు జరిగినప్పుడే చర్యలు చేపట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బాధితులకు అత్యవసర వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.తద్వారా ప్రాణాపాయా న్ని తప్పించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలన్నారు. చిన్నారి శ్రావణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చింతల వెంట బిజెపి నాయకులు తదితరులున్నారు.