15 April, 2026 | 9:33 AM

గొత్తి కోయ పిల్లలకు ‘చలి కోట్లు’ పంపిణీ

16-12-2025 12:48 AM

పాల్వంచ, డిసెంబర్ 15, (విజయక్రాంతి):చాలీచాలని దుస్తులతో చలికి గజగజ వణుకుతున్న గొత్తి కోయల పిల్లలకు చలికోట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మహానుభావులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ మండలం, ఉల్వనూరు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పం చ్ బర్ల లక్ష్మణరావు, పాల్వంచ పట్టణానికి చెందిన జెన్కో ఉద్యోగి రామకృష్ణారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉలవనూరు గ్రామపంచాయతీ పరిధిలోని‘ పెద్ద కలస’ అనే గొత్తి కోయలగూడెంలో ఉన్న 20 మంది చిన్నారులకు చలి కోట్లు (స్వెటర్లు) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ బర్ల లక్ష్మణరావు మాట్లాడుతూ... నిరుపేద చిన్నారులకు చలి నుండి రక్షణ కల్పించుట కొరకు చలికోట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో బేతం రవి, బేతం ప్రభాకర్ , గ్రామస్తులు పాల్గొన్నారు.