05-09-2025 07:04:46 PM
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్ పెట్ శివారులో గల నాగనైపేట్ డబుల్ బెడ్రూమ్లలో శుక్రవారం రోజు చేతి పంపును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ హరి భవన్ ల ఆధ్వర్యంలో నాగ నాయిపేట్ డబల్ బెడ్రూంలో రెండు చేతిపంపులను ఏర్పాటు చేయడం జరిగింది అని కాలనీవాసులు తెలిపారు. దాదాపు ఇక్కడ మొత్తం 40 డబుల్ బెడ్రూంలు ఉండగా, 400 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి.
ప్రతి బోర్ బావి దగ్గర చేతి పంపును బిగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపల్ నుండి వచ్చే మంచినీరు ఎప్పుడైనా రానప్పుడు ఈ చేతి పంపులు బాగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. కాలనీవాసులు చేతి పంపు నుండి వచ్చిన నీటిని వినియోగించుకుంటున్నారు. చేతి పంపు ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.