17 June, 2026 | 11:10 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళా మృతి

09-10-2025 10:21 PM

గాంధారి (విజయక్రాంతి): గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో గల గిద్ద చెరువులో ప్రమాదవశాత్తు మహిళా పడి మృతి చెందినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన కథనం ప్రకారం.. పోతంగల్ గ్రామానికి చెందిన దుర్కి సాయవ్వ(40) ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సాయవ్వ భర్త రెండో పెళ్లి చేసుకొని నిజాంసాగర్ లో నివసిస్తుండగా, ఈమె తన కూతురుతో పోతంగల్ గ్రామం నందు నివసిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.

గురువారం ఉదయం 9 గంటలకు సాయవ్వ బహిర్బుమి/ కాలకృత్యాలు చేయుటకై గిద్ద చెరువు వద్దకు వెళ్లి, బహిర్ భూమికి వెళ్లి, అక్కడ చెరువు దగ్గర కాలుజారి అందులో పడి ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. మృతురాలి ఏకైక కూతురిని గత మూడు నెలల క్రితం కోటగిరి పోతంగల్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగినది. కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.