09-10-2025 10:17:38 PM
జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ నేత
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటి కాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసారని కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్ నేత హైదరాబాదులో హైకోర్టు ముందు పాత్రికేయలతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో.. యావత్తూ తెలంగాణ బీసీలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపారికల్ డేటా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎంపారికల్ డేటా ఉన్నా స్టే విధించి బీసీల నోటికాడ ముద్ద లాగే ప్రయత్నం చేయడం శోషనీయం అని ఆవేదనతో చెందారు. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నాం... కట్టుబడి ఉంటాం అవనిగంటపదంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బీసీలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చర్చిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ బిడ్డలు ఎవరు అధైర్యపడొద్దు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని తెలిపారు. బిజెపి, బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్ అవ్వాలి... లేకపోతే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు అని దుయ్యబట్టారు. త్వరలో బీసీల తడాకా ఎంతో చూపిస్తామని బీసీలు తల్చుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట బీసీ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.