calender_icon.png 10 October, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ పట్టుబడిన చిట్యాల తహసీల్దార్

09-10-2025 10:23:59 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండల తహసీల్దార్ కృష్ణా నాయక్ రైతు వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా నల్గొండ ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఉదంతం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణను విచారించిన ఏసీబీ అధికారి సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి మహబూబ్ నగర్ రేంజ్, నల్గొండ ఇంచార్జ్ విలేకరులతో మాట్లాడుతూ గుండ్రంపల్లి గ్రామానికి చెందిన 172 సర్వేనెంబర్ నందు ల్యాండ్ ముటేషన్ చేయడానికి, అదే గ్రామానికి చెందిన 167 సర్వే నెంబర్ లో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడానికి రైతు వద్ద నుండి ఇనిషియల్ గా తహసీల్దార్ కృష్ణా నాయక్ పది లక్షల రూపాయలు డిమాండ్ చేయగా రిక్వెస్ట్ పైన ఐదు లక్షలకు సెటిల్మెంట్ అవ్వగా, రెండు లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ప్రైవేట్ నెట్ ఆపరేటర్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగిందని, ఎమ్మార్వో కృష్ణ నాయక్ రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారి  పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుండి పనిచేయడానికి లంచం అడిగినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేసి గాని, వాట్సప్ ద్వారా గాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.