రైలు ఢీకొని మహిళ మృతి
05-08-2025 05:27 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎదురుల్లగూడెం గ్రామానికి వెళ్లే దారిలో రైలు పట్టాలను దాటుతున్న గుళ్లనీ పోచమ్మ అనే మహిళను రైలు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోచమ్మ భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామం నుండి ఎదులగూడెం గ్రామానికి వస్తుండగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో బ్రిడ్జి పై నుండి పట్టాలు దాటుతుండగా చెవులు వినపడని, కండ్లు సరిగా కనిపించని పోచమ్మ రైలును గమనించకపోవడంతో రైలు ఢీ కొట్టిందని ఆమె అల్లుడు కొండే నరసింహ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే పోలీసులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.






