05-08-2025 05:23:32 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రైతులకు 2025-26 సంవత్సరానికి గాను సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలను అందించడం జరుగుతుందని వీటిని రైతులు సభ్యులను చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అంజనీదేవి తెలిపారు.
వలిగొండ మండలానికి సబ్సిడీపై అందించే వాటిలో బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 76, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 12, రోటోవేటర్స్ 4, సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ 1, ట్రాక్టర్ కి సంబదించిన పరికరాలు 3, పవర్ వీడర్ 1, బ్రష్ కట్టర్ 1, పవర్ టిల్లర్ 1, స్ట్రా బేలర్ 1, బండ్ ఫార్మర్ 1,మొత్తం 101 పరికరాలకి గాను 906000 మంజూరయ్యాయని తెలిపారు.
పెద్ద రైతులకు 40%, చిన్న, సన్నకారు రైతులకి 50% సబ్సిడీ పై వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతులు దరఖాస్తు తో పాటు భూమి పట్టా పాసుబుక్ జీరాక్స్, ఆధార్ జిరాక్స్, ట్రాక్టర్ పరికరాలైతే RC జిరాక్స్ మరియు పాస్ ఫోటో జత చేసి 14 వ తేదీ వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.