30-12-2025 01:49:26 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బండ్లగూడలో(Bandlaguda) లిఫ్ట్ గుంతలో పడి మహిల మృతి చెందింది. నాలుగో అంతస్తు నుంచి కింద పడిన వృద్ధురాలు లక్ష్మి మృత్యువాత పడింది. లిఫ్ట్ వచ్చిందని వృద్ధురాలు గ్రిల్ ఓపెన్ చేయడంతో కిందపడిపోయింది.నాలుగో అంతస్తు లిఫ్ట్ గుంతలో పడిపోయి లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బండ్ల గూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.