calender_icon.png 4 May, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాము కాటుతో మహిళ మృతి

04-05-2025 05:43:25 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలం పెద్దూరు గ్రామంలో పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కడం ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి(SI Krishna Sagar Reddy) తెలిపిన వివరాల ప్రకారం... నేరెళ్ల రజిత( 31) అనే మహిళ పెద్దూరు గ్రామంలోని తమ స్వగృహం వద్ద తోట పని చేసుకుంటుండగా అక్కడే ఉన్న పాము ఆమెను కాటు వేయగా, కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను హుటాహుటిన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.