calender_icon.png 4 May, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలి

04-05-2025 05:32:01 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు, ప్రజలు సన్నద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమరులోకి తెచ్చిందని విమర్శించారు.

ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాల అమలు స్కీం వర్కర్స్ సమస్యలు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం పనిచేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కార్మికుల ప్రయోజనాలు సంక్షేమం కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు జే.వెంకటేష్, కాసు మాధవి, వంగూరి రాములు, పాలడుగు సుధాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ పాల్గొన్నారు.