02-12-2025 11:10:02 AM
కాషాయం కండువా కప్పి ఆహ్వానించిన అరిగెల నాగేశ్వరరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని రాజుర గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు భాజపా పార్టీలో చేరారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్(One Nation One Election District Convener) అరిగెల నాగేశ్వరావు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు,ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు.
గ్రామాలలో అభివృధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరిగాయని తెలిపారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మోతుగూడ గ్రామ పంచాయతీ లో భాజపా బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖయం అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్,భాజపా జిల్లా యూత్ అధ్యక్షులు గాజుల రాజేంద్రప్రసాద్,యువ నాయకుడు అరిగెల అనురాగ్,నాయకులు దీపక్ రావ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.