02-12-2025 07:59:39 AM
తూప్రాన్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి ఆకుల రవి రెండో విడతలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను మండల సమీకృత కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయడం జరిగింది. గ్రామ ప్రజల ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింది. గతంలో ఉపసర్పంచిగా అనుభవం కలిగిన వ్యక్తి కావడంతో గ్రామ ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పించారని గ్రామ ప్రజలందరు సర్పంచిగా నాకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.