08-10-2025 12:40:56 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్, అక్టోబర్7(విజయక్రాంతి):మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సా ధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శం గా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో జిల్లా కలెక్టర్ ప సమావేశం ఏర్పాటు చేశారు.మహిళలు విభిన్న రంగాలలో రాణించాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇచ్చామని అన్నా రు.
అంతేకాకుండా వారికి ఉచితంగా ఆటో లు అందజేశామని తెలిపారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని మహిళా ఆటో డ్రైవర్లు ఉపాధి పొందాలని పేర్కొన్నారు. ఆటోలను కుటుంబ సభ్యులకు, ఇతరులు ఎవరికీ ఇవ్వరాదని అన్నారు. ఆటోలు కేటాయించిన మహిళలే నడుపుతూ తోటి మహి ళలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ సమావేశంలో మహిళా ప్రాంగణం మేనేజర్ సుధారాణిపాల్గొన్నారు.