08-10-2025 12:41:21 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ వాస్తవానికి వాల్మీకి సమాజం వెనుకబడిన తరగతుల్లో భాగంగా ఉందని, అయితే వాల్మీకి సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గద్వాల ప్రాంతంలో ఉండే బోయ వాల్మీకీలకు అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇ వ్వడంలేదని తెలిపారు. ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.