25 April, 2026 | 6:48 AM

మహిళల్లో అభద్రతా భావం

06-03-2025 12:00 AM

భారతదేశంలో మహిళల స్థితి అనేక మార్పులకు లోనైంది.  ప్రాచీన కాలంలో, ముఖ్యంగా ఇండో-ఆర్య న్ మాట్లాడే ప్రాంతాలలో, సమాజంలో వారి స్థానం గణనీయమైన మార్పులకు గురైంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన (17571857),  బ్రిటిష్ రాజ్ (18581947) కాలంలో, భారత సంస్కర్తలు, వలస అధికారులు ప్రారంభించిన సంస్కరణలతో సహా మహిళల హోదాను ప్రభావితం చేసే చర్యలు అమలు చేయబడ్డాయి,

వాటిలో బెంగాల్ సతి నియంత్ర ణ1829 , హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం1856, స్త్రీ శిశుహత్య నివార ణ చట్టం 1870 వంటివి ఉన్నాయి. భారత రాజ్యాంగం లింగ వివక్షతను నిషేధిస్తోంది. వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తోంది. రాజ్యాం గం ప్రకారం మహిళల హక్కులలో ప్రధానంగా సమానత్వం, గౌరవం, వివక్షత నుం డి స్వేచ్ఛ ఉన్నాయి. అదనంగా, దేశంలో మహిళల హక్కులను నియంత్రించే వివిధ చట్టాలు ఉన్నాయి.

దేశంలో అనేక మంది మహిళలు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి వివిధ సీనియర్ అధికారిక పదవుల్లో పనిచేశారు. అయితే, దేశంలో చాలామంది మహిళలు గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలలో పోషకాహార లోపం రేట్లు ఎక్కువగా ఉన్నాయి, దీని పరిణామాలు పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. మహిళలపై హింస, ముఖ్యంగా లైంగిక హింసతీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. 

ఆకాశంలో సగం 

మహిళల రక్షణ, గౌరవం అందరి బాధ్యత. దుండగుల దౌర్జన్యాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి-. ప్రభుత్వా లకు సమాజం సహకరించాలి. పిల్లలు, కుటుంబ సభ్యులపై పెట్టుకున్న ఆకాంక్షల నేపథ్యంలో  బాధ్యతాయుతమైన వ్యక్తులుగా రూపొందించడానికి మహిళలది ప్రధాన పాత్ర కాగా కుటుంబంలో మహిళలు ఈ కీలక బాధ్యత పోషిస్తున్న విష యం కాదనలేని సత్యం. బాల్యం నుండి అమ్మాయిల పట్ల కొంత వివక్షత చూపుతున్న మాట వాస్తవం. వివక్షతకు దారితీ స్తున్న విషయాన్ని కూడా కుటుంబాలు చిన్ననాటి నుండి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.

మారుతున్న కాలగమనంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా బాలికల రక్ష ణ గందరగోళంలో పడుతున్న నేపథ్యంలో ఆత్మ రక్షణ కోసం అన్ని రకాల విద్యలను నేర్చుకోవలసిన అవసరం ఉంది. బాలురతో పాటు బాలికలకు కూడా ఆ రకమైన శిక్షణ  చిన్ననాటి నుండి ఇప్పించడంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంచే  పరిస్థితులను సమాజం, తల్లిదండ్రులు, పాఠశాల కల్పించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. అప్పుడు మాత్రమే వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు మహిళ గురికాకుండా ఉంటుంది. 

అన్ని రంగాలలోనూ మగవారితో  సమానంగా స్త్రీలు  కూడా రాణిస్తు న్న విషయం  కాదనలేని సత్యం. అయినా మహిళలు  అనేక రకాల దాడులకు గురికావడాన్ని తిప్పికొట్టడానికి  ఉమ్మడిగా సమాజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలతో పాటు ప్రభుత్వ మే కొనసాగిస్తున్నటువంటి కొన్ని రకాల తప్పుడు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను రద్దు చేయగలిగితే ఇలాంటి దురాగతాలకు  కొంతవరకు చరమగీతం పాడవచ్చు.

అమానుష చర్యలు

పెండ్లి చేసుకోలేదని అక్కసుతో పైశాచికంగా వ్యవహరించే సైకోలు యాసిడ్ దాడులకు పాల్పడడం,  కత్తులతో పొడిచి హత్య చేయడం, అకృత్యాలు, అత్యాచారాలకు పాల్పడడం కాకుండా ప్రేమోన్మాదు ల వికృత చేష్టలకు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా దేశంలో వేలల్లో ఉండడం ఆషామాషి వ్యవహారం కాదు.  స్త్రీల అక్రమ రవాణా తో జాడ తెలియకుండా పోతున్న వారు కొందరైతే,  అనుమానాస్పద మృతి కారణంగా తల్లిదండ్రులకు దూరమవుతున్న ఆడబిడ్డల సంఖ్య అంతా ఇంతా కాదు. మహిళలపై వేధింపుల పర్వం  కన్నతండ్రి నుండి మొదలు కొంటే ఇంటి పక్క వాళ్ళు, అవకాశవాదులు, పనిచేసే ప్రతిచోట అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారే ఎక్కువ. 

అది కూడా తెలిసిన కుటుంబాలే ఎక్కువ అని ఇటీవల కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. పెళ్లికి ఒప్పుకోవడం లేదనేది ఒక కారణమైతే  అనుమానాస్పదంగా కాపురంలో  కలతల కారణంగా మరికొందరు,  తాగుడుకు బానిసై ఇంకొందరు ఏది ఏమైనా   అనుచితంగా ప్రవర్తించడం, శారీరక, మానసిక హింసకు గురి చేయడం మహిళలపై దాడులే !  గమ్మత్తు ఏమిటం టే చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధులపైన కూడా మహిళల పైన లైంగిక వేధింపుల కేసులు  ఎక్కువగా ఉన్న ఈ దేశంలో  ఇందుకు గల కారణాలను పాలకులు నిర్లక్ష్యం చేయడమే అని  తెలుస్తున్నది.

కొన్ని గణాంకాలు 

ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 202324  సర్వే ప్రకారంగామహిళల భద్రత విషయంలో  177 దేశాలకు గాను  భారతదేశం 128వ స్థానంలో    నిలిచింది అంటే మహిళలపై అకృత్యాలు ఏ స్థాయి లో జరుగుతున్నాయో  అర్థం చేసుకోవ చ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014 లో  దేశంలో మహిళల పైన నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదు కాగా  ఎనిమిదేళ్ల అనంతరం అంటే 2022 లో అవి 31 శాతం మేర అదనంగా పెరిగాయి.

మహిళలను ఈ రకంగా వివక్షతకు గురిచేయడానికి గల ప్రధానమైన కారణా లు మనందరికీ తెలుసు. వీటికి చరమగీతం పాడాలంటే, మహిళలు బలి పశువు లు కాకుండా ఆత్మగౌరవంతో బ్రతికేలా చూడాలంటే  మగజాతికి సోయి తెచ్చి   తమకూ భార్యా పిల్లలు, చెల్లెళ్లు ఉన్నారని ఇంగిత జ్ఞానాన్ని  పదే పదే వారి దృష్టికి  తేవడం అవసరమేమో!  తమ దాకా వస్తే కానీ తెలియనటువంటి దుర్మార్గపు పోకడలో కొనసాగుతున్న ఈ మానవ మృగాలకు చట్టపరంగా తగిన శిక్షతో పాటు  అవకాశాలను నిషేధించడం,  విద్యాసంస్థల్లో  స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షతను చిన్ననాటి నుండే రద్దు చేయడం, సోదర భావా న్ని కొనసాగించడానికి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం కూడా కీలకమని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. 

చాలా ప్రాంతాలల్లో జరిగిన ప్రతి సంఘటనలోనూ  ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల  స్త్రీలు ఎక్కువగా  దాడులకు గురవుతున్నటువంటి సందర్భాలను గమనించినప్పుడు ఇది ఒక పథకం ప్రకా రం కొనసాగుతున్నదని అనుమానం రాక మానదు.  కారణం చట్టాలు, ప్రభుత్వాలు రాజకీయ పార్టీల అధికారాలు అన్నీ కూడా మెజారిటీగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండడం కూడా ఇందుకు కారణమేమో!

ప్రతి చోటా వ్యాపార వస్తువే..

మద్యం ధూమపానం, మత్తు పానీయా లు, ఇతరత్రా టీవీలు, సినిమాల్లో  స్త్రీలను అంగడి బొమ్మగా మార్కెట్ వస్తువుగా  ప్రవేశపెడుతున్నటువంటి పాలకు ల, పెట్టుబడిదారీ వర్గాల మాయాజాలా న్ని కూడా  సమాంతరంగా దహనం చేయాలి. సామాజిక మాధ్యమాలలో మహిళలకు సంబం ధించిన చిత్రాలు, సన్నివేశాలు ప్రదర్శనలు వ్యాఖ్యానాలు, మగవాళ్లలో  ధైర్యాన్ని  ఎంతకైనా తెగించే  మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తున్న కారణంగా అలాంటి వాటిని కూడా నిషేధించడం ద్వారా మాత్రమే ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. 

విలువలతో కూడిన  విద్య,  వికృత రూపాలకు తగిన శాస్తి జరిగినట్లు చూపే కళా రూపా లు, సమాజంలో స్త్రీల బాధ్యత కుటుంబాలలో వాళ్ళ పాత్రపైన స్పష్టమైనప్రద ర్శనలు ఇవ్వడం ద్వారా కూడా కరకు గుండెల్లో,  బండరాతి మెదళ్లలో కూడా ఆర్ద్రత రాబట్టాలి.   రోజురోజుకు మహిళలపైన పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించ డం ద్వారా  ప్రపంచంలో కూడా స్త్రీల భద్రతకు సంబంధించినటువంటి స్థానాన్ని మనం పదిలపరుచుకోవాల్సిన అవసరం ఉంది.  సోషల్ మీడియా తన దురాగతా న్ని కట్టడి చేయకపోతే ప్రభుత్వాలు, ఇతర యంత్రాంగం లేదా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా దానికి  తగిన నివా రణను కేంద్ర ప్రభుత్వం వెదకాలి. ప్రతి రం గంలో మహిళలకు అభద్రతాభావం కొనసాగుతోంది. చట్టాలు మహిళల హక్కుల ను కాపాడడంలో కీలక పాత్ర పోషించాలి.

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి