calender_icon.png 7 July, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

07-07-2025 01:51:23 AM

 ఆమనగలు, జూలై 6: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొహర్రం కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గ్రామంలో ప్రత్యేకంగా పేర్లను ఊరేగింపు చేపట్టి అనంతరం స్థానిక బావుల్లో పేర్లను నిమజ్జనం చేశారు. ఊరేగింపు కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దావ ధనంజయ్య, మాజీ కౌన్సిలర్ కా మటం రాధ వెంకటయ్య, దావ అనంత రాములు, దావ యాదగిరి దావ శ్రీపాల్,తాళ్ల సహదే వ్,తాళ్ల కిష్టయ్య,కమఠం రవి,కె. చరణ్, లోడుగా శివ, సందీప్ రెడ్డి రవిలు పాల్గొన్నారు.