7 August, 2026 | 2:30 AM

ప్రమాదం జరిగితే తప్ప.. పట్టించుకోరా..?

07-08-2026 12:23 AM

బెజ్జూర్ ఆగస్టు 6 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని బారెగూడ వాగు వంతెన పై సైడ్ వాల్ విరిగి పడిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. మండలంలోని బరేగూడ వాగుపై ని ర్మించిన వంతెన యొక్క సైడ్ వాల్ విరిగిపడి ఉండడంతో ప్రమాదంగా ఉందని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాగులో సైతం చెక్ డ్యామ్ ఉండడంతో నీటి సామర్థ్యం సైతం పెరిగిందని అదుపుతప్పి ఎవరైనా ప్రయాణికులు పడిపోయినట్లయితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

కొన్ని సంవత్సరాలుగా వంతెన పై ఉన్న సైడ్ వాల్ పట్టిలు మరమ్మత్తులు చేయకపోవడంతో విరిగిపడిపోతున్నాయి. గతంలో సైడ్ వాల్ పట్టీలకు నామమాత్రంగా మరమ్మత్తులు చేసి బిల్లులు దండుకున్నారే తప్ప నాణ్యతతో పనులు చేయకపోవడంతో వంతెన సైడ్ వాల్ ప్రమాదకరంగా ఉందని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెనపై సైడ్ వాల్ పట్టీలు నాణ్యతతో పనులు చేసేలా అధికారులు చూడాలని కోరుతున్నారు.