7 August, 2026 | 2:29 AM

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

07-08-2026 12:27 AM

బెల్లంపల్లి, ఆగస్టు 6: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి గురు వారం రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏసీపీ కార్యాలయ ఆవరణను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఆలస్యానికి గల కారణాలను ఏసీపీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని, నేరాల నియంత్రణకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సివిల్ భూ వివాదాల్లో పోలీసులు అనవసర జోక్యం చేసుకోకుండా చట్టపరమైన విధానాల ప్రకారమే వ్యవహరించాలని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీల్లో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.