calender_icon.png 25 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంక్షేమానికి కృషి

25-01-2026 12:22:57 AM

  1. మంత్రి సీతక్క
  2. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం 
  3. మంత్రి పొన్నం ప్రభాకర్ 

మహబూబాబాద్/ మేడారం, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహి ళా సంక్షేమం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివా రం మహబూబాబాద్, కేసముద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రులు పొన్న ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి 152 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, మహ బూబాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన సుం దరీకరణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసముద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..  కోటి మంది మహిళలను మహిళా సంఘా ల్లో చేర్పించి కోటీశ్వరులను చేసే విధంగా ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తుందన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ..  ఆరు గ్యా రెంటీలను అమలు చేయడానికి కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, డాక్టర్ జాటోత్ రామ్ చందర్ నాయక్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి పాల్గొన్నారు. కాగా మేడారంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు.