25-01-2026 12:23:19 AM
మదాపూర్ అయ్యప్ప సొసైటీలో షురూ..
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ సంప్రదాయ వంటల వారసత్వాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో సద్దిమూట హోమ్ ఫుడ్, డెలివర్ ను మదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి దివి ముఖ్య అతిథిగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. శ్రీధర్‌రెడ్డి వెల్మజాల స్థాపించిన సద్దిమూట, పల్లెల్లో రైతులు, ప్రయాణికులు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని గుడ్డ మూటగా కట్టుకొని తీసుకెళ్లే పాత సంప్రదాయాన్ని ఆధారంగా తీసుకుంది.
ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు శ్రీధర్‌రెడ్డి వెల్మజాల మాట్లాడుతూ.. ‘మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే నిజమైన, ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని మళ్లీ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సద్దిమూటను ప్రారంభించాం’ అన్నారు. చంద్రుడి థీమ్‌తో రూపొందించిన అలంకరణ, చెట్లతో సహజ వాతావరణాన్ని ప్రతిబింబించే రెస్టారెంట్ ఆంబియన్స్ అతిథుల నుంచి విశేష ప్రశంసలు పొందింది. ముఖ్య అతిథి నటి దివి వద్థ్య మాట్లాడుతూ.. సద్దిమూట పేరు ఎంత అందంగా ఉందో, రెస్టారెంట్ ఆంబియన్స్ కూడా అంతే అందంగా ఉంది. చంద్రుడి సెటప్, డెకొరేషన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆహారం పూర్తిగా ఇంటి భోజనం లాగానే ఉంది. అని తెలిపారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ‘ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ పెరుగుతున్న ఈ కాలంలో, మన మూలాలకు తీసుకెళ్లే సద్దిమూటను ప్రారం భించినందుకు శ్రీధర్ను అభినందిస్తున్నాను’ అన్నారు.