06-08-2025 12:46:10 AM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించిన బీఆర్ ఎస్ నాయకులు
కామారెడ్డి, ఆగస్టు 5 (విజయ క్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ( PPP ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిపారు.
మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ , బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో LEౄ స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనాయకులు సమక్షంలో పవర్ పా యింట్ ప్రజెంటేషన్ విక్షించారు. మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, జుక్కల్, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజల సురేందర్, కామారెడ్డి BRS పార్టీ జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, కామారెడ్డి జిల్లా BRS పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.