4 August, 2026 | 3:45 PM

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

04-08-2026 02:36 PM

చేర్యాల: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చేర్యాల పట్టణ పరిధిలోని బండపల్లి అంగన్‌వాడీ సెంటర్-1 లో బాలింతలకు శ్రీమంతం నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ మాట్లాడుతూ... పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి వాటిని చీము పాలు అంటారు.

పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని  తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి తల్లి తెలుసుకోవాలని అన్నారు. ప్రతి తల్లి అంగన్‌వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. సంతోష్ కుమార్, అంగన్‌వాడీ టీచర్ ఎం. ధన్య,ఆయా ఎన్.అంజమ్మ, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.