calender_icon.png 25 November, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 17 నుంచి వరల్డ్ టెన్నిస్ లీగ్

25-11-2025 12:02:22 AM

  1. ఒకే టీమ్‌లో బోపన్న, మెద్వెదేవ్

బరిలో స్టార్ ప్లేయర్స్

బెంగళూరు, నవంబర్ 24 : వరల్డ్ టెన్ని స్ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా లీగ్ డిసెంబర్ 17 నుంచి 20 వరకూ బెంగళూరులో జరుగుతుంది.ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ ప్లేయర్స్ ఆ లీగ్‌లో సందడి చేయనున్నారు. తొలి సీజన్‌కు ఇంకా మూడు వారాలే మిగిలి ఉండడంతో టీమ్స్‌తో పాటు ఫ్రాంచైజీ ఓనర్లను ప్రకటించారు.

గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్, వీబీ రియాల్టీ హాక్స్, ఆసీ మావెరిక్స్ కైట్స్ , ఏఓఎస్ ఈగల్స్ టీమ్స్ పోటీపడనున్నాయి. గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్ టీమ్‌లో మెద్వెదేవ్, రోహన్ బోపన్న, మగ్ధ లినెట్టే, సహజ యమలపాల్,  వీబీ రియాల్టీ హాక్స్ టీమ్‌లో షపలోవ్, యుకీ బాంబ్రి, ఎలీనా స్విటోలినా, మాయా రేవతి, ఆసీ మావెరిక్స్ కైట్ టీమ్‌లో 

కిర్గియోస్, దక్షిణేశ్వర్ సురేష్, మర్తా కొస్టుయాక్, అంకిత రైనా, ఏఓఎస్ ఈగల్స్ జట్టులో మోన్‌ఫిల్స్, సుమిత్ నగాల్, పాలా బడోసా, శ్రీవల్లి భమిడిపాటి ఆడనున్నారు. నాలుగురోజుల పాటు హోరాహోరీ టెన్నిస్ మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా 2022 దుబాయ్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో హాక్స్, 2023లో ఈగల్స్, 2024లో ఫాల్కన్స్ చాంపియన్లుగా నిలిచాయి.