calender_icon.png 31 October, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహదేవమ్మ చెరువుకు పూజలు

31-10-2025 12:19:10 AM

45 ఏళ్ల తర్వాత ఆలుగు పారడంతో సంబురాలు జరుపుకున్న రైతులు

 తలకొండపల్లి, అక్టోబర్30 (విజయ క్రాంతి): తలకొండపల్లి మండలంలోని వెల్జ ల్ గ్రామంలో చారిత్రాత్మకమైన సహదేవమ్మ చెరువు 45 ఏళ్ల తర్వాత నిండి అ లుగు పారింది. దీంతో గ్రామంలోని రైతులు సంబరాలు జరుపుకున్నారు. గత కొన్నేళ్లుగా చెరువు ఎప్పుడు నిండుతుందో అని ఎదురుచూసిన మాకు  ఈరోజు పండుగ అంటూ చెరువు వద్ద గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశా రు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, పలు పార్టీల నేతలు చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. సహదేవమ్మ చెరువు నిండితే దాదాపుగా 15 గ్రామాలకు చెందిన రైతులకు ఆధారం అవుతుంది. పలు గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరుకు తిప్పలు ఉండదని ఆయా గ్రామాల చెరువు నిండడంపై తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.