calender_icon.png 31 October, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి

31-10-2025 09:26:11 AM

  1. పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న డీసీఎం.
  2. తుక్కుతుక్కయిన బొలేరో వాహనం.
  3. బొలేరో వాహనంలో పెళ్లి బృందం.
  4. ఐదుగురు పరిస్థితి విషమం..
  5. పెళ్లింట తీవ్ర విషాదం.

హైదరాబాద్: హనుమకొండ జిల్లా(Hanumakonda District) భీమదేవరపల్లి మండలం గోపాల్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. పెళ్లి బృందం వాహనాన్ని డీసీఎం  ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సుందనపల్లి వాసులుగా గుర్తించారు. మృతులను కమలమ్మ(60), త్రినాథ్(5), స్వప్నగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డీసీఎం బలంగా ఢీకొట్టడంతో బొలేరో వాహనం తుక్కుతుక్కు అయిందని పోలీసులు తెలిపారు. పెళ్లింట తీవ్ర విషాదం నెలకొనడంతో కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.