calender_icon.png 31 October, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన

31-10-2025 09:05:11 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) శక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరంగల్, హుస్నాబాద్( Warangal and Husnabad) వరద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. మొంథా తుపాన్ తెలంగాణలోని నాలుగు జిల్లాలపై భారీగా ప్రభావం చూపించింది. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ త్వరలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వరంగల్, హన్మకొండ వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద నీరు పలు కాలనీల్లో ఇంకా నిలిచిపోయింది.

భారీ వర్షంతో ఇళ్లల్లో బురద పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వస్తువులు, సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం సాయం చేయాలంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. మొంథా తుపాను(Cyclone Mantha) వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు.