31-10-2025 12:20:22 AM
-కాటన్ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో
- కొర్రీలు పెడుతున్నారని ఆరోపణ
-రైతులు, అధికారులు, మిల్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం
నాగర్ కర్నూల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి):నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి కాటన్ మిల్ వద్ద పత్తి కొనుగోళ్లలో నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రైతులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు రెండు గంటలపాటు స్తంభించాయి. సీసీఐ అధికారులు పత్తి తడిసిందని కొనుగోలు చేయకపోవడం రైతుల్లో తీవ్ర అసం తృప్తిని కలిగించింది. దళారుల పత్తిని తేమశాతం పరిశీలించకుండానే కొనుగోలు చే స్తుండగా, రైతుల పత్తికి మాత్రం కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ మద్ద తు ధరకు విక్రయించడానికి వచ్చిన రైతులు కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. రాస్తారోకో కారణంగా గగ్గలపల్లినాగర్ కర్నూల్ మార్గం లో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం సమ యంలో ఆయా ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలిస్తున్న బస్సుల సైతం చిక్కుకోవడంతో ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గుర య్యారు.
పత్తి నాణ్యతను పరిశీలించి నిజాయితీగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రైతులు, కాటన్ మిల్ నిర్వాహకులు, మార్కెటింగ్ సిబ్బందుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడించడంతో రైతులు శాంతించారు.