31-10-2025 12:17:29 AM
 
							- స్పృహ కోల్పోవడంతో అస్పత్రికి తరలిస్తుండగా మృతి
- బాటసింగారం వాగులో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 30(విజయక్రాంతి): బాటసింగారం పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం, నందనం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ప్రభాకర్, కృష్ణవేణిలు నేర్రపల్లికి వచ్చారు. కృష్ణవేణి తండ్రి రవీందర్ మాజీ సర్పంచ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో అస్తికలు గంగలో కలపడానికి వారు ఆ ఊరు వచ్చారు.
ఈ నేప థ్యంలో ఆ దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామానికి బైకుపైన బయలు దేరారు. మధ్యలో బాట సింగారం మజీద్‌పూర్ వద్ద ఉన్న పెద్దవాగులో కృష్ణవేణి బ్యాగు పడి పోయింది. బ్యాగు ను అందుకునే క్రమంలో బైకుతో సహా దంపతులు వాగు లో పడిపోగా కృష్ణవేణి కొట్టుకపోయింది. గమనించిన స్థానికులు వెంటన రవీందర్ కృష్ణవేణిలను రక్షించి స్థానికంగా ఉండే దవాఖాన తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త క్షేమంగా ఉన్నట్లు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌లు తెలిపారు.