05-05-2025 06:22:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ వేద పండితులు బాలకృష్ణ శర్మ అరుదైన పురస్కారం అందుకున్నారు. శ్రీ శృంగేరీ శారదా పీఠం శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా చతుర్వేద పండితులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శారదా పరమేశ్వరీ అమ్మవారి అనుగ్రహముతో శృంగేరీ పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య అనుగ్రహములచే ఈ సంవత్సరం శుక్ల యజుర్వేద పండితునిగా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కురవి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన వేద పండితులు శ్రీ బాలకృష్ణ శర్మ (ఘనపాఠి)కు సువర్ణ ఉంగరము, ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు.