04-11-2025 12:30:34 AM
							ములకలపల్లి, నవంబర్ 3, (విజయక్రాంతి):ములకలపల్లి లోని శివాలయంలో సోమవారం సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం లోని సోమవారం కావడంతో ము లకలపల్లి శివాలయంలో ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను, పూజలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని, శివుడిని ఆరాధించారు.
కుటుంబ సమేతంగా భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. అర్చకులు సురేష్ శర్మ సత్యనారాయణ స్వామి వ్రత విశేషాలను, సత్యనారాయణ స్వామి కథను భక్తులకు వివరించారు. శివాలయం ఆలయ ధర్మకర్త నరాటిప్రసాద్, శనగపాటి సీతారాములు, కోదుమూరి వేణుగోపాల్,పువ్వాల లలితారావు తదితరులు పాల్గొన్నారు.