22 August, 2026 | 2:34 AM

అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..

22-08-2026 12:00 AM

జంపన విద్యావతి ప్రతాప్

సికింద్రాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టఐశ్వర్యాలు కలుగుత యాని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ సిటీ కాలనీ లోని తన నివాసంలో కుటుంభ సభ్యులు శుక్రవారం నిర్వహించిన  జరిగిన వరలక్షి వ్రతం పూజ లో  జంపన ప్రతాప్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ వరలక్ష్మీ అమ్మ వారిని  పూజిస్తే అష్టలక్ష్మీలను పూజించినట్లే అని వరాలు ప్రసాదిస్తుందని అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు. జంపన ప్రతాప్ సతీమణి విద్యావతి,కుటుంభసభ్యులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మహిళలకు వాయనం అందజేశారు.