గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని అవమానిస్తారా?
- ప్రొటోకాల్ పాటించరా!
- క్షమాపణలు చెప్పకుంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా
- ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): డోర్నకల్ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్ర మాల్లో ప్రొటోకాల్ పాటించలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కురవి మండలం గుండ్రతి మడుగు పెద్ద తండాలో మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీగా ఉన్న తనను కనీ సం ఆహ్వానించలేదని అన్నారు. గిరిజన మహిళా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను అవమానించినట్టేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగతంగా తనకు, తమ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని అన్నా రు.
తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమంపై తనకు సమాచారం ఇవ్వకపోవడం ఎలాంటి సంస్కారమో సమాధానం చెప్పాలని సత్యవతి రాథోడ్ అన్నారు. తప్పు జరిగిందని భావిస్తే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.






