calender_icon.png 9 November, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ ఎమ్మెల్యే

08-11-2025 12:00:00 AM

బిచ్కుంద, నవంబర్ 7 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు వివాహ వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఎస్ కన్వెన్షన్ లో  ఘనంగా జరిగాయి. వివాహ మహోత్సవంలో భాగంగా నూతన వధూవరులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని, దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఆయన వెంట ఓబీసీ రాష్ట్ర నాయకుడు సాయి పటేల్, సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, దొండ్ల ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు, బంధుమిత్రులు, పాలుగోన్నారు.