calender_icon.png 7 November, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుంధతి రెడ్డికి ఘనస్వాగతం

07-11-2025 12:00:00 AM

  1. వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో ప్లేయర్
  2. హైదరాబాద్‌కు చెందిన అరుంధతిరెడ్డి

హైదరాబాద్, నవంబర్ 6 : మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ప్లేయర్‌గా ఉన్న హైదరాబాదీ క్రికెటర్ అరుంధతిరెడ్డికి నగరంలో ఘనస్వాగతం లభిం చింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టుతో పాటు ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి ఇవాళ హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆమెకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అభిమానులు, కు టుంబసభ్యులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణకు గర్వకార ణంగా నిలిచిన అరుంధతి అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ అభినందనలు తెలిపారు.

ఆల్వాల్‌కు చెందిన భాగ్యరెడ్డి కుమార్తె అయిన అరుంధతిరెడ్డి గత కొన్నేళ్ళుగా భారత జాతీ య జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. మహిళల ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అరుంధతి రెడ్డి గతం లో హైదరాబాద్ అండర్ అండర్ అండర్ జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది. భారత్‌కు 11 వన్డేలు, 38 టీట్వంటీల్లో ప్రాతినిథ్యం వహించింది.