7 August, 2026 | 2:30 AM

ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

07-08-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్

శంకర్ పల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ ఛైర్మ న్ సాత ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. గు రువారం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వా ర్డు అయ్యప్పరెడ్డిగూడ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరు సీలింగ్ ఫ్యాన్లు, ఉచితంగా షూస్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కో రారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శ్వేత పాం డురంగారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు బాలకృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సదాలక్ష్మి, ఉపాధ్యాయులు తాహెర్ అలీ, సునీత, సానికే మహేష్ తదితరులు పాల్గొన్నారు.