24-01-2026 12:00:00 AM
బెల్లంపల్లి, జనవరి 23 : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, టీజీఈ డబ్ల్యూ ఐడిసి ఈ.ఈ., జిల్లా విద్యాధికారి యాదయ్య, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జె. సంపత్ లతో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావ్యవ స్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంలో భాగం గా జిల్లాలో 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరి ధిలోని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బెల్లంపల్లి పట్టణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మాణానికి అనువైన 25 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పనులు వేగవంతం చేసి 2027 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.