24-01-2026 12:00:00 AM
నిర్మల్ జనవరి 23 (విజయక్రాంతి) : నిర్మల్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ డి. శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరా రు. వారితో పాటు పట్టణ ముఖ్య నాయకులు భూమన్న, ఆనంద్, ఈశ్వర్, రమేష్, విజయ్, వరప్రసాద్, దత్తు పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావు ల రాంనాథ్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, నాయకులు శనిగరపు చిన్నయ్య, రంజిత్, బంటి తో పాటు తదితరులు పాల్గొన్నారు.